- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఫ్యామిలీ మ్యాన్ 3’ లో సందీప్ కిషన్.. ?

దిశ, సినిమా: OTT లో మంచి హిట్ అదుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘ఫ్యామి మ్యాన్’ ఒకటి. 2013లో సీజన్ 1 విడుదలై అత్యధిక మంది వీక్షణలు సొంతం చేసుకున్న సిరీస్ గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించిన సీజన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ఇక ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1, 2 ఘన విజయాలు సాధించగా ఇప్పుడు మూడవ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన స్క్రిప్టింగ్ దాదాపు పూర్తయింది. మేకర్స్ త్వరలో షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇందులో శ్రీకాంత్ తివారీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్ళు వెంటాడుతూనే ఉంటాయి. మని ఈసారి వాటిని ఎలా ఎదుర్కొన్నాడనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. కాగా 2005లో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
అయితే తాజాగా ఈ సీరీస్ కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటీ అంటే ప్రజంట్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘కెప్టెన్ మిల్లర్’, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాల్లో కనిపించిన.. సందీప్ ఇప్పుడు ఈ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ లో కూడా ముఖ్య పాత్రలో నటించనున్నారు. మరి ఈ యాక్షన్ డ్రామా సిరీస్ లో సందీప్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.