క్రేజీ బ్యూటీగా మారిన సంయుక్తా మీనన్.. బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్!

by Hamsa |
క్రేజీ బ్యూటీగా మారిన సంయుక్తా మీనన్.. బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. సంయుక్త కు వరుస అవకాశాలు వచ్చాయి. బింబిసార, సార్, విరూపాక్ష మూడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ కాలంలోనూ సంయుక్తా మీనన్‌కు వీపరీతమైన పాపులారిటీ రావడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఈ అమ్మడు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఏమాత్రం తగ్గకుండా తన అందాలతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. నిత్యం ట్రెండీ వేర్ దుస్తులతో నెట్టింట రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు కుర్రాళ్ళను ఆకట్టుకుంటున్నాయి. అందులో బ్లాక్ కలర్ టాప్, బాటమ్ వైట్ కలర్ ధరించి మత్తెక్కించే చూపులతో మాయ చేస్తుంది. ప్రస్తుతం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, సంయుక్తా మీనన్ బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ తొందరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.Next Story

Most Viewed