అజ్ఙాతంలోకి సమంత అంటూ వార్తలు.. సడన్‌గా అక్కడ దర్శనమివ్వడంతో అంతా షాక్

by sudharani |
అజ్ఙాతంలోకి సమంత అంటూ వార్తలు.. సడన్‌గా అక్కడ దర్శనమివ్వడంతో అంతా షాక్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది. అలాగే.. గతంలో మయోసైటిస్ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. సగంలో ఆపేసిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడింది. అంతే కాకుండా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన సామ్.. హెల్త్‌కు సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఇక వీటితో పాటు.. విపరీతమైన గ్లామర్ డోస్ పెంచేసిన సామ్ బేబీ.. నిత్యం బోల్డ్ షో తో రెచ్చిపోతూ.. ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తుంది. అలాంటి సమంత.. గత రెండు, మూడు రోజులుగా ఇన్‌స్టాలో ఎటువంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో ఫ్యాన్స్‌లో కాస్త ఆంధోళన మొదలైంది. అంతే కాకుండా కొందరూ సమంత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది అంటూ ట్రోల్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఇలాంటి సమయంలో సమంత పెట్టిన పోస్ట్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆధ్యాత్మిక గురువు సద్గురు సేవాలో మునిగిపోయిన సమంత.. అక్కడికి వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తూ ‘మనలో చాలా మంది గురువు లేదా మంచి చెప్పేవారి కోసం వెతుకుతారు. మీరు మీ జీవితాన్ని వెలిగించే ఒక అద్భుతమైన శక్తిని (అవగాహన, కరుణతో ఉండే ఒకరిని) కనుగొన్నప్పుడు అది ఎంతో అరుదైన ప్రత్యేకతగా భావిస్తారు. జ్ఞానం యొక్క ప్రత్యేకత తెలియాలంటే మీరు ప్రపంచంలో వెతకాలి. రోజువారీ విషయాలు మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నప్పుడు అది మీమ్మల్ని చాలా సులభంగా మార్చుతుంది. కానీ మీరు అనుకుంటారు జ్ఞానం మామూలు విషయం అని. కానీ ఇది సాధారణమైనది కాదు. మీరు దాని కోసం కష్టపడాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed