టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత.. బాధలో ఫ్యాన్స్ ?

by Dishanational2 |
టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత.. బాధలో ఫ్యాన్స్ ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, అనతి కాలంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి, స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తన నటనతో అన్ని భాషల్లోని ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ఇక మొదటి సినిమాతో నాగచైతన్యతో ప్రేమలో పడ్డ సామ్, తర్వాత హీరోను అంగరంగ వైభవంగా , పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. కలకాలం కలిసి ఉంటామనుకున్న వీరు నాలుగు సంవత్సరాలకే విడిపోయారు. తర్వాత సమంత ఆరోగ్యం కూడా క్షీణించడం, కొన్ని రోజుల ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత సమంత ఈ మధ్యనే కోలుకుంది. అయితే ఈ నేపథ్యంలో సమంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదేమిటంటే.. సామ్ త్వరలోనే టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనుందంటూ, ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఇటీవల ఓ కన్నడ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇది చూసిన నెటిజన్స్ సామ్ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పబోతుందంటూ బాధపడుతున్నారు. అంతే కాకుండా సామ్ తెలుగులో ఖుషి తప్ప ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు, సామ్ టాలీవుడ్‌కు దూరం కాబోతుందంటూ తమ అభిమానులు భయపడుతున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాంలంటే, సామ్ స్పందించాల్సిందే అంటున్నారు కొందరు.


ఇవి కూడా చదవండి :

ఇండస్ట్రీలో విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ కపుల్?

పెళ్లికి గెస్ట్‌లా వచ్చిన విష్ణు.. కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్..?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed