నాగచైతన్య కంటే ముందే అతన్ని ప్రేమించిన సమంత.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు!

by Hamsa |
నాగచైతన్య కంటే ముందే అతన్ని ప్రేమించిన సమంత.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో సమంత ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించి తన అందం అభినయం, నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. నాగచైతన్య ఏమాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. అంతేకాకుండా ఓ ఐటెం సాంగ్‌లోనూ నటించి దుమ్మురేపింది. ఈ సినీ జర్నీ క్రమంలో అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్ది కాలం పాటు వీరిద్దరి కాపురం సజావుగా సాగినప్పటికీ మనస్పర్థలు వచ్చాయి.

దీంతో సామ్, చై విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి నాగచైతన్య వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక సమంత మాత్రం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మయోసైటీస్ వ్యాధికి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అయినప్పటికీ వీరిద్దరి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, సమంత ఫస్ట్‌లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది. చై కంటే ముందే ఓ వ్యక్తిని లవ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పింది. ‘‘ నేను చదువుకునే సమయంలో పల్లవరం నుంచి టీ నగర్ వెళ్ళడానికి రెండు బస్సులు మారాలి. రోజు వెళ్లడానికి రెండు గంటలు పడుతుంది. అయితే రెండేళ్ల పాటు ఒక అబ్బాయి నా కోసం ప్రతిరోజు బస్టాండ్‌లో వెయిట్‌చేసేవాడు. నా స్కూల్ వరకు వచ్చేవారు. నాలుగు ఐదు అడుగుల దూరంలోనే ఉండి చూసేవారు కానీ అస్సలు మాట్లాడరు.

ఒంటరిగానే వస్తారు.. ఏమీ అనరు చేసేవారు కాదు. అయితే అలా నాకు 12 క్లాస్ అయిపోయింది. అప్పుడు ఇక నేనే అతని దగ్గరకు వెళ్లి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారని అడిగేశాను. అప్పుడు నేను మిమ్మల్ని ఫాలో చేయలేదు అనేశారు. అప్పుడు నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. అలా షాక్‌లో ఉండిపోయాను. అయితే అది ప్రేమో కాదో నాకు తెలియదు కానీ అదే నా ఫస్ట్ లవ్’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed