సిక్స్ దాటితే అంతే.. ఏ పొజిషన్లో అయినా సరే.. చైతు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత

by Hamsa |
సిక్స్ దాటితే అంతే.. ఏ పొజిషన్లో అయినా సరే.. చైతు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య కపుల్స్‌కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు ‘ఏ మాయ చేసావే’ సినిమా చేసి.. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పలు మనస్పర్థల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు వేరు వేరుగా ఉంటూ కేరీర్‌పై ఫోకస్ పెట్టి వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. కానీ, వాళ్ళు విడాకులు తీసుకున్నప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే గతంలో పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్యపై చేసిన బోల్డ్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

సామ్ మాట్లాడుతూ ‘‘పెళ్లి తర్వాత పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు .. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా అయిపోయాడు. మరీ ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఎటువంటి సినిమాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోకూడదు. అంటూ స్ట్రిక్ట్‌గా కండిషన్స్ పెట్టారు. అది ఎలాంటి పొజిషన్లోనైనా సరే.. అలాగే రూల్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయించాడు. అంతే కాదు పెళ్ళికి ముందు నాతో షాపింగ్‌కు వచ్చి గంటలు గంటలు టైం స్పెండ్ చేసిన నాగచైతన్య పెళ్లి తర్వాత మాత్రం నాతో టైం షాపింగ్‌కు వచ్చిందే లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుత సామ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Also Read: తడిచిన బట్టల్లో సెగలు కక్కుతున్న సోనమ్..

Next Story