ఆ సినిమా నుంచి సమంత అవుట్.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్..!

by sudharani |
ఆ సినిమా నుంచి సమంత అవుట్.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఖుషి’ అనంతరం సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. అయితే.. మూవీ షూటింగ్స్‌లో పాల్గొననప్పటికీ ఏదో ఒక వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చూస్తూనే ఉంది. దీంతో సమంత మళ్లీ సినిమాలకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు కొందరు అభిమానులు.

ఈ క్రమంలోనే నందిని రెడ్డి దర్శకత్వంలో, సిద్ధు జొన్నలగడ్డ సరసన సమంత నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఖచ్చితంగా ఏడాది పాటు రెస్ట్ తీసుకోవాలని సమంత నిర్ణయించుకుందట. దీంతో డైరెక్టర్ నందినీ రెడ్డి మరో హీరోయిన్‌ని వెతుక్కునే పనిలో పడిందట. ఈ క్రమంలోనే సిద్దూ సరసన నిత్యామీనన్ లేదా మాళవికా నాయర్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఫైనల్‌గా ఏం జరుగుతోందో.

Next Story