ఆ హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించిన సల్మాన్ ఖాన్..

by Anjali |
ఆ హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించిన సల్మాన్ ఖాన్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌ అంటే సల్మాన్ పేరు ముందుంటుంది. అయితే తాజాగా సల్మాన్‌కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. హీరోగా సినీ రంగంలో అడుగుపెట్టిన మొదట్లో సల్మాన్ ఓ హీరోయిన్ మనస్ఫూర్తిగా ప్రేమించారంట. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని నేరుగా ఆ హీరోయిన్ పేరెంట్స్‌తో చెప్పినప్పటికీ.. ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందుకు కారణం సల్మాన్ అప్పటికి మంచి పొజిషన్‌లో లేక పోవడమే. అలా సల్మాన్ జీవితంలో లవ్ మ్యారేజ్ కొద్దిలో తప్పిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఇప్పటికే బాలీవుడ్‌లో చక్రం తిప్పేసిన సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా అని టాక్.

Also Read...

‘పుట్టింటి పరువు తీస్తున్న నిహారిక..’ సోషల్ మీడియాలో ట్రోల్స్

Next Story