- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెజెండరీ సింగర్ బయోపిక్ నుంచి సాయి పల్లవి ఔట్.. ఆ లక్కీ చాన్స్ దక్కించుకున్న నేషనల్ క్రష్!
భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండరీ సింగర్, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో టైటిల్ రోల్ కోసం రష్మికను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గత ఏడాది ‘గర్ల్‌ఫ్రెండ్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌తో తీరిక లేకుండా గడుపుతోంది. హిందీలో రష్మిక ‘కాక్‌టైల్-2’ రోమాంటిక్ ఎంటర్టైనర్‌లో నటించగా.. జూన్ 19, 2026న థియేటర్లలోకి రాబోతోంది. దీంతో పాటుగా విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. 18వ శతాబ్దపు రాయలసీమ యోధుడి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 90% పూర్తయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు రష్మిక ‘మైసా’ అనే పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రంలో కూడా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మిక ఓ లక్కీ చాన్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండరీ సింగర్, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో టైటిల్ రోల్ కోసం రష్మికను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇటీవల రష్మిక ఇంట్లో ఒక ప్రత్యేకమైన లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. సాంప్రదాయ దుస్తులలో రష్మిక లుక్ చాలా బాగా వచ్చిందని టాక్. నిజానికి, ఈ పాత్ర కోసం గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంతల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా సాయి పల్లవి ఈ పాత్ర కోసం కర్నాటక సంగీతంలో శిక్షణ కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ చివరకు మాత్రం మూవీ మేకర్స్ రష్మికను ఫైనల్ చేయనున్నట్లు టాక్. అయితే ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






