నాకు కడుపొచ్చిన విషయమే తెలియదంటున్న బ్యూటీ

by Disha Web Desk |
నాకు కడుపొచ్చిన విషయమే తెలియదంటున్న బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ రుబీనా దిలైక్ తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది. ఇటీవల భర్త అభినవ్ శుక్లాతో కలిసి ప్రినేటల్ క్లినిక్ ఉన్న భవనంలోకి ప్రవేశించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడం, రూమర్స్ క్రియేట్ చేయడం చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుందని తెలిపింది. 'గర్భధారణ గురించి తప్పుడు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ సమావేశానికి హాజరయ్యేందుకు ఆ భవనానికి వెళ్లాం. అందులో ఏవైనా క్లినిక్‌లు ఉన్నాయో లేదో మాకైతే తెలియదు. మీకోసం తనిఖీ చేయాలనుంది' అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది. ఇక ఇలాంటి పుకార్లు తనకేమీ కొత్తకాదన్న ఆమె.. 'ప్రజలు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతారని తెలుసు. కానీ దేనికి ప్రతిస్పందించాలనే విషయంపై క్లారిటీతో ఉన్నా. దేన్నీ వ్యక్తిగతంగా తీసుకోను. కాబట్టి ఎవరిపై కోపంగా ఉండటం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉన్నట్లే నాకూ ఉందని తెలుసుకోవాలి' అంటూ వివరించింది.


Next Story

Most Viewed