బిగ్ బ్రేకింగ్: ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో చోటు దక్కించుకున్న RRR

by Disha Web |
బిగ్ బ్రేకింగ్: ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో చోటు దక్కించుకున్న RRR
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్వకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకుంది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. కాగా, 95వ ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ప్రకటన కాలిఫోర్నియాలో బ్లేవరిహిల్స్‌లో కాసేపటికి క్రితం జరిగింది. ఇందులో ఆర్ఆర్ఆర్ మూవీ చోటు దక్కించుకుంది.

అయితే, 2022 ఆస్కార్ అవార్డ్‌ల బరిలో భారత్ నుండి వివిధ విభాగాల్లో 10 చిత్రాల్లో పోటీ పడ్డాయి. RRR, ద ఛల్లో షో, కాశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత్ రోణ, రాకెట్రీ, గంగూబాయి కతియావాడి, మి వసంతరావ్ వంటి సినిమాలు వివిధ విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచాయి. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో నిలిచిన ఆర్ఆర్ఆర్ చరిత్రకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కాగా, ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్‌ల విజేతలను మార్చి 13న ప్రకటిస్తారు. ఇక, ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెల్చుకున్న సంగతి తెలిసిందే.


Next Story