RRR సినిమా ఆస్కార్ అవార్డ్ గెలవాలి: పవన్ కల్యాణ్

by Disha Web |
RRR సినిమా ఆస్కార్ అవార్డ్ గెలవాలి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీర్సో రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెల్చుకున్న ఈ మూవీ.. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ఫైనల్ నామినేషన్‌కు ఎంపికైంది. ఆస్కార్ అవార్డ్‌కు అడుగు దూరంలో నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్లకు ఎంపిక కావడంపై టాలీవుడ్ స్టార్ పవన కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డ్‌కు అడుగు దూరంలో నిలిచిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ గెలవాలని కోరుకున్నారు. ఓ తెలుగు పాట ఆస్కార్ అవార్డ్ కోసం పోటీపడటం గర్వకారణమని అన్నారు. ఈ పాటకు అద్భుత సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఈ పాటలో కళ్లు చెదిరే డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు డైరెక్టర్ రాజమౌళి, మూవీ యూనిట్‌కు అభినందలు తెలిపారు.


Next Story