ఆ హీరోలతో రొమాన్స్ తండ్రితో చేస్తున్నట్లు అనిపించేది.. నటి షాకింగ్ కామెంట్స్

by sudharani |
ఆ హీరోలతో రొమాన్స్ తండ్రితో చేస్తున్నట్లు అనిపించేది.. నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది నటి ఇషా కొప్పికర్. 2000వ దశకంలో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోయిన ఈమె.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. ‘చంద్రలేఖ, ప్రేమతో రా’ వంటి మూవీస్‌లో నటించిన ఇషా.. 2017లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనకంటే పెద్ద హీరోలతో నటించడంపై ఓపెన్ అయింది.

ఆమె మాట్లాడుతూ.. ‘కొంతమంది సీనియర్ నటులతో కలిసి పనిచేసినప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించేది. నా కంటే 30, 20 ఏళ్లు పెద్దవారితో పని చేస్తున్నప్పుడు, వారితో రొమాన్స్ చేసినప్పుడు కొంచె ఇబ్బందిగా అనిపించేది. సాధారణంగా క్యారెక్టర్‌లో భాగంగా మీ భాగస్వామిని లేదా ప్రేమికుడిని కౌగిలించుకున్నట్లు మీకు మీ తండ్రిని కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. పెద్ద హీరోలతో నటించేటప్పుడు మొదట్లో నాకు కూడా అలాగే అనిపించేది. అయితే.. నటించేటప్పుడు ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇక కొంత మంది హీరోలు మంచిగా కలిసిపోతారు. మరికొందరు మాత్రం మేము సీనియర్లం మా స్థాయి ఇదే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు’ అంటూ తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది ఇషా కొప్పీకర్.Next Story

Most Viewed