డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేసిన అనుష్క.. ఏకంగా పరుగెడుతున్న రైలుపై

by Sujitha |
డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేసిన అనుష్క.. ఏకంగా పరుగెడుతున్న రైలుపై
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అనుష్క శెట్టిని లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు అభిమానులు. ఇతరులు సమస్యల్లో ఉంటే క్షణం ఆలోచించకుండా డబ్బులు ఇచ్చే మంచి మనసున్న మనిషిగా మన్ననలు పొందింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. కార్తీకి జోడీగా అలెక్స్ పాండ్యన్ మూవీలో నటించిన ఆమె.. డూప్ అందుబాటులో లేకపోవడంతో రియల్ స్టంట్ చేసిందని తెలుస్తుంది. అనార్కలి డ్రెస్ లో మూవింగ్ ట్రెయిన్ ఎక్కినట్లు ఓ ఈవెంట్ లో చెప్పాడు కార్తి. ఆమెకు అంత గొప్ప కమిట్మెంట్ ఉందని పొగిడాడు.

ఇంతకీ ఆమె ఎందుకలా చేసిందంటే.. ఆ రోజు డూప్ లేక షూటింగ్ ఆగిపోతే నిర్మాత నష్టపోతాడని అలా చేసిందని తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు మరింత గర్వంగా ఫీల్ అవుతున్నారు. కాగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ.. ఈ మధ్యే మరో సినిమా షూటింగ్ ప్రారంభించింది. వచ్చే సమ్మర్ లో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తుంది.

Next Story

Most Viewed