అంబానీ వేడుకలో పరువు పోగొట్టుకున్న రిహాన.. అందరి ముందే బట్టలు...

by sudharani |
అంబానీ వేడుకలో పరువు పోగొట్టుకున్న రిహాన.. అందరి ముందే బట్టలు...
X

దిశ, సినిమా: రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ధూమ్ ధామ్‌గా జరుగుతున్నాయి. పెళ్లికి ఇంకాస్త సమయం ఉండటంతో ముందస్తు వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు ఈ గ్రాండ్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తు్నారు. అంతే కాకుండా.. ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన సింగర్ రిహానాకు ఓ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..

అమెరికన్ గాయని రాబిన్ రిహానా ఫెంటీ అందరికి సుపరచితమే. నిండా 40 ఏళ్లు లేని ఈమె.. వ్యాపారవేత్త, నటి, సింగర్ కూడా. ఈ అమ్మడు ఆట పాటకు చిత్ర పిరిశ్రమలో తిరుగులేదు. దీంతో.. అంబానీ ఇంట ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రూ. 50 కోట్లు తీసుకున్నట్లు టాక్. అంబానీ ఇంటా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ అమ్ముడు పెర్ఫార్మెన్స్‌కు సెప్టెలు వెయ్యని వాళ్లు లేరు. ఇదిలా ఉంటే.. ఈ వేడుకలో రిహానాకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. తాను పెర్ఫామ్ చేస్తున్న సమయంలో రిహానా అండర్ ఆర్మ్ వద్ద దుస్తులు చిరిగాయి. ఈ దుస్తులు మరీ పలుచగా ఉండటం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె పట్టించుకోకుండా.. పెర్ఫార్మెన్స్ కంటీన్యూ చెయ్యడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.Next Story

Most Viewed