'రిచి గాడి పెళ్లి'.. మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ: హేమరాజ్

by Disha Web Desk 7 |
రిచి గాడి పెళ్లి.. మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ: హేమరాజ్
X

దిశ, సినిమా: కె.ఎస్.ఫిల్మ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'రిచిగాడి పెళ్లి'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలో నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. కె.ఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను హరీష్ శంకర్ తాజాగా లాంచ్ చేశారు. చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుండగా.. ఈ గేమ్స్ వల్ల పిల్లల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే పూర్తి కథాంశం. ''రిచిగాడి పెళ్లి' అనేది మానవ సంబంధాలను ప్రతిబింబించే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం' అని హేమరాజ్ తెలిపాడు.

Also Read..

అనారోగ్యంతో బాధ పడుతున్న సీనియర్ నటి.. వైరల్ పిక్స్

Next Story

Most Viewed