'బాయ్‌కాట్' ట్రెండ్ సినీ కార్మికుల పొట్టకొడుతోంది : రిచా చద్దా

by Hajipasha |
బాయ్‌కాట్ ట్రెండ్ సినీ కార్మికుల పొట్టకొడుతోంది : రిచా చద్దా
X

దిశ, సినిమా: బాలీవుడ్ 'బాయ్‌కాట్' ట్రెండ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది రిచా చద్దా. ముఖ్యంగా హిందీ చిత్ర పరిశ్రమను 'చెత్త' అని పిలుస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ దూషించింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ నోట్ రాసిన నటి.. ప్రస్తుతం బాలీవుడ్‌ ఎదుర్కొంటున్న విమర్శలు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇండస్ట్రీపై కావాలని బురదజల్లే వారు ఎప్పుడైనా ఒక సెట్‌కి వెళ్లి పనిచేసే వ్యక్తులను చూడాలని సూచించింది. వారి కళ్లలోకి చూస్తూ ఇదే విషయాన్ని పదే పదే చెప్పలేరని, ఎందుకంటే వాళ్లను చూసి ఆశ్చర్యపోతారని చెప్పింది. కొంతమందిపై కోపంతో 'బాయ్‌కాట్' పేరిట ఎంతోమంది ఉపాధిని తొలగించే ప్రయత్నం చేయకూడదన్న రిచా.. జనాలకు మంచి చేసే సంస్థలు, పరిశ్రమలు ఏవైనా పునర్నిర్మించబడాలని కోరుకుంది. త్వరలో ఈ పరిస్థితి మారిపోవాలని ఆశిస్తున్నట్లుగా వెల్లడించింది.

Also Read : జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు

Next Story

Most Viewed