పెళ్లికి ముందే కాళ్ల బేరానికి వచ్చిన రిచా ప్రియుడు.. (వీడియో)

by Disha Web Desk 6 |
పెళ్లికి ముందే కాళ్ల బేరానికి వచ్చిన రిచా ప్రియుడు.. (వీడియో)
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ రిచాచద్దా-అలీ ఫజల్ వివాహ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వారంలోనే వీరి పెళ్లి జరగనుండగా గత మూడు రోజులుగా ఢిల్లీలో సంగీత్ పార్టీ నడుస్తోంది. ఈ సందర్భంగా మెహెందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా తాజాగా మరో వీడియో బయటకొచ్చింది. ఇందులో కొత్త జంట ఫేమస్ హిందీ సాంగ్ 'అంబర్సరియా'కు డ్యాన్స్ డ్యాన్స్ చేస్తుండగా.. డిజైనర్ రాహుల్ మిశ్రా సెట్ చేసిన 'త్రీ పీస్ కస్టమ్ మేడ్ లెహంగా'లో రిచా బ్యూటిఫుల్‌గా కనిపించింది. మరోవైపు లాల్‌చీ ధరించి లక్షణంగా కనిపించిన ఫజల్ మోకాళ్లపై కూర్చొని నాగిని స్టెప్పులేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సంబంధిత వీడియో వైరల్ అవుతుండగా.. 'పెళ్లికి ముందే కాళ్ల బేరానికి వచ్చాడు పాపం' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed