పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను తెలుపుతూ రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్.. మళ్లీ కలుస్తున్నారా?

by Hamsa |
పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను తెలుపుతూ రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్.. మళ్లీ కలుస్తున్నారా?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ మొట్టమొదటిసారి ‘బద్రి’ సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత జాని మూవీలోనూ నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనూ వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. పవర్ స్టార్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఇండస్ట్రీకి దూరమై తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు పై ఫోకస్ పెట్టింది.

ఇప్పుడు అకీరా, ఆద్య పెద్దవారు కావడంతో.. రేణు ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. అనాధ పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. అయితే ఈ మధ్య ఓ నెటిజన్ పవన్ కల్యాణ్ గోల్డ్ హార్ట్ ఉన్న వ్యక్తి ఆయన పిల్లలకు మీరు తల్లి అయి ఉండి అతని గురించి అలా అనకండి అని పోస్ట్ పెట్టాడు. దీనికి రేణు దేశాయ్ అతను నా భర్త కాదంటూ పలు కామెంట్స్ చేయడంతో పాటుగా.. పవన్‌తో తనను పోల్చొద్దని చెప్పింది.

దీంతో ఆయన ఫ్యాన్స్ ఆమెపై పలు విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్, పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను ఇండైరెక్ట్‌గా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. పవన్‌తో చేసిన సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘‘ నేను నమ్మలేకపోతున్నాను ఇది నేనేనా’’ అని రాసుకొచ్చింది. అలాగే రెండు లవ్ సింబల్స్ కూడా జత చేసింది. ఇక అది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ.. పరోక్షంగా మాజీ భర్తపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించిందని అంటున్నారు. అలాగే కొందరు ఇద్దరు పిల్లల కోసం మళ్లీ కలిసిపోతారని అంటున్నారు.


Next Story