ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్.. విసుగొచ్చి సింగిల్‌గానే ఉండిపోయిన నటి!

by Javid Pasha |
ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్.. విసుగొచ్చి సింగిల్‌గానే ఉండిపోయిన నటి!
X

దిశ, సినిమా : కొంతకాలం రిలేషన్‌లో ఉన్నప్పటికీ ఏవో కారణాలతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న నటీ నటులు ఆల్ సినీ ఇండస్ట్రీస్‌లో మస్తు మందే ఉన్నారు. సల్మాన్ ఖాన్, టబు, అమీషా పటేల్ వంటి బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా లవ్ అండ్ బ్రేకప్ కారణంగా ఫైనల్లీ సింగిల్‌గానే మిగిలిపోయారు. అయితే అలాంటి వారిలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి కూడా ఉందని మీకు తెలుసా? అయితే ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్, ఆ తర్వాత నిశ్చితార్థం కూడా జరిగాక చివరికి పెళ్లి ఆమె క్యాన్సిల్ అయింది. దీంతో మ్యారీడ్ లైఫ్‌పై విసుగు చెంది సింగిల్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇప్పుడామె దక్షణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు. క్వీన్ ఆఫ్ సౌత్‌గా ఇండస్ట్రీని ఏలేస్తోంది.

2010లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ కామెడీ చిత్రం ‘ఖట్టా మీఠా’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఖిలాడీ మూవీతోనూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మూవీస్‌కి కొంతకాలం గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్‌గా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. కాగా గతంలో ఈమె లవ్‌లో పడి మోసపోయిందని, ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్‌లో ఉన్నదని, ఆ తర్వాత గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ బిజినెస్‌మెన్‌తోనూ ఎంగేజ్‌మెంట్ జరిగి క్యాన్సిల్ అయిందని వార్తలు గుప్పుమన్నాయి.

ఇటీవల దళపతి విజయ్‌తో కూడా ఆమె రిలేషన్‌లో ఉందని, ఈ కారణంగానే ఆయనకు తన భార్యకు విడాకులిచ్చి సదరు నటిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని వార్తలు వైరల్‌ కాగా సదరు హీరోయిన్‌తోపాటు విజయ్ దళపతి కూడా వీటిని ఖండించాడు. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం గత రిలేషన్ కారణంగా విసుగు చెందడంవల్లే ఆమె ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటోందని కామెంట్లు చేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమయ్యుండవచ్చు!

Next Story