రవితేజ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’కి అరుదైన ఘ‌న‌త‌! ఆ భాష‌లో మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ సినిమా

by Kavitha |
రవితేజ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’కి అరుదైన ఘ‌న‌త‌! ఆ భాష‌లో మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ సినిమా
X

దిశ, సినిమా: ర‌వితేజ హీరోగా, వంశీ ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఈ మూవీని అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించగా, జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. చెవిటి , మూగ వారి కోసం ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న తొలి భార‌తీయ చిత్రంగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చ‌రిత్ర‌లోకి ఎక్కింది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న‌తో ఈ సినిమా బావుంద‌నే పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ లాభాలు మాత్రం తీసుకురాలేక పోయింది.

ఇదిలాఉండ‌గా గ‌తంలో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన 83 చిత్రాన్ని కూడా ఈ సైన్ లాంగ్వేజ్‌లో తీసుకు వ‌చ్చినా ఫ‌స్ట్ టైం టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు చిత్రం మాత్ర‌మే మ‌న భార‌తీయ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలో విడుద‌ల అవుతున్న‌ చిత్రంగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమేర‌కు ఈ సినిమా నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ భాష‌లో ప్ర‌తి విష‌యంలోనూ చేతులు, చేతి వేళ్లు, కళ్లు, ముఖ కవళికలు, శరీర హావభావాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒకేసారి కనుబొమ్మలను, చేతి వేళ్ల‌ను కదుపుతూ చేసే ప్ర‌క్రియ ద్వ‌ారానే సినిమా గురించి చూసే వారికి వివ‌రిస్తారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న‌ది. ఆస‌క్తి ఉన్న‌వారు వెళ్లీ చూసేయ్యండి.

Read More...

ఓటీటీలోకి ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

Next Story

Most Viewed