- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చావు నుంచి తప్పించుకున్నామంటూ సంచలనం సృష్టిస్తున్న రష్మిక పోస్ట్..

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ పామ్‌లో ఉంది. ఈ అమ్మడు ఇటీవల రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అందరికీ షాకిచ్చింది. అలాగే ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక రోజు రోజుకు రష్మిక క్రేజ్ మరింత పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ మధ్య రష్మిక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. తాజాగా, నేషనల్ క్రష్ ‘‘మీకు సమాచారం ఇవ్వడం కోసం తెలియజేస్తున్నాము. ఈ రోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా శ్రద్దా దాస్‌తో ఉన్న పిక్‌తో పాటు ఇద్దరి కాళ్లను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలు చూస్తుంటే వారిద్దరు ఫ్లైట్‌లో ఏదో షూటింగ్‌కు వెళ్తున్నట్లు అర్థమవుతోంది.
ఇక ఈ పోస్ట్ చూసిన వారు అసలు వారికి ఏమి జరిగి ఉంటుంది.. ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొంటూనే హిందీ, తమిళ, కన్నడ, తెలుగు వంటి బాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ దూసుకుపోతుంది. అంతేకాకుండా తన అందం నటనతో అందరినీ మెప్పిస్తూ.. పాన్ ఇండియా హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది.