- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘పుష్ప2’.. ఆ పాత్రలో కనిపించనున్న శ్రీవల్లి..!

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో.. దీని సీక్వెల్‌పై హై ఎక్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంతే కాకుండా తొలి భాగంతో పోల్చితే ఈ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయేలా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. అల్లు అర్జున్ లుక్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు శ్రీవల్లి (రష్మిక) పాత్రకు సంబంధి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ క్రమంలోనే రష్మిక పాత్రకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. పార్ట్ 1లో కేవలం గ్లామర్ రోల్‌కే పరిమితం అయ్యింది రష్మిక. కానీ పార్ట్ 2లో మాత్రం అంతకు మించి ఉండనుందట. సీక్వెల్‌లో రష్మిక గర్భవతి పాత్రలో కనిపించనుందట. అంతే కాకుండా తల్లి సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా ఆమె అలరించనుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మొత్తానికి శ్రీ వల్లిని మొదటి పార్ట్‌తో పోల్చితే అంతకు మించి అన్నట్లుగా పుష్ప 2 లో చూపించబోతున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ముగించుకుంటున్న ఈ చిత్రం.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.