మీలా నాకు చేయాలని ఉంటుంది కానీ.. లవర్స్ డే ప్లాన్‌పై ఓపెన్ అయిన రష్మిక

by sudharani |
మీలా నాకు చేయాలని ఉంటుంది కానీ.. లవర్స్ డే ప్లాన్‌పై ఓపెన్ అయిన రష్మిక
X

దిశ, సినిమా: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో నటించి పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుని.. ప్రజెంట్ ‘పుష్ప 2’ షూటింగ్‌తో బిజీగా ఉంది. మరోవైపు విక్కీ కౌశల్ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ ‘చావ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక. అయితే.. సినిమాల విషయం పక్కన పెడితే రష్మిక మందన్న.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటో షూట్‌లతో నెట్టింట సందడి చేయడమే కాకుండా.. పర్సనల్, ప్రోఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంటుంది. అంతే కాకుండా.. టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్ అవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. వారిని వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటీ..? అంటూ ప్రశ్నించింది. అలా చాలా మంది రష్మిక ట్వీట్‌కు స్పందించారు. రష్మిక వాళ్లకు కూడా రిప్లైలు ఇచ్చింది. ఈ మేరకు.. ఓ నెటిజన్.. ‘రేపు మీ ప్లాన్స్ ఏమిటి మేడమ్. మేము ప్రేమికుల రోజు కోసం మా కాలేజ్‌లో మాస్ బంక్ చేయాలని నిర్ణయించుకున్నాము, కళాశాల విద్యార్థులు చేసే విధంగా నటులు, నటీమణులు లేదా ఎవరైనా సినీ ఆర్టిస్టులు ప్రేమికుల రోజున మాస్ బంక్ చేస్తున్నారా’ అని ప్రశ్నించాడు. దానికి రష్మిక.. ‘చాలా కష్టం రో.. మనం చేయగలననుకుంటాను కానీ.. మీరు ఒక సినిమాని ఒప్పుకుంటే దానికి చాలా బాధ్యతలు కూడా వస్తాయి’ అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన చాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story