‘యానిమల్’ దెబ్బతో షైనింగ్ స్టార్‌గా మారిపోయిన రష్మిక.. సోషల్ మీడియాలో మరింత పెరిగిన ఫాలోయింగ్

by Disha Web Desk 6 |
‘యానిమల్’ దెబ్బతో షైనింగ్ స్టార్‌గా మారిపోయిన రష్మిక.. సోషల్ మీడియాలో మరింత పెరిగిన ఫాలోయింగ్
X

దిశ, సినిమా: కన్నడ మూవీ ‘కిరిక్ పార్టీ’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న.. తన అద్భుతమైన నటన, అందం కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి సక్సెస్ అయింది. తాజాగా ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అద్భుతమైన విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతకు ముందు ‘పుష్ప’ లో శ్రీవల్లిగా మంచి క్రేజ్ అందుకోగా ఇప్పుడు ‘యానిమల్’ మూవీతో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. అవును తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్న, సోషల్ మీడియాలో 40 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ఈ నటి స్థిరంగా సోషల్ మీడియాలో ముందు స్థానంలో ఉంది.

Next Story