ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన రష్మిక.. వారికోసమేనట!

by Prasanna |
ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన రష్మిక.. వారికోసమేనట!
X

దిశ, సినిమా: స్టార్ నటి రష్మిక మందన్నా తన చేతిపై వేసుకున్న టాటూ సీక్రెట్ ఏంటో చెప్పేసింది. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం 'మిషన్ మజ్ను' 2023 జనవరి 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొంటున్న రష్మిక తాజా సమావేశంలో మాట్లాడుతూ.. 'మొదట నా చేతి మీద ఏ టాటూ వేయించుకోవాలో క్లారిటీ లేదు. 'అమ్మాయిలు ఎక్కువ నొప్పిని భరించలేరు. వారికి సూదులంటే చాలా భయం' అని మా కాలేజీలో ఓ అబ్బాయి ఎద్దేవా చేశాడు. దీంతో నాకు చాలాకోపం వచ్చింది. ఎలాగైనా అది తప్పని నిరూపించాలనుకున్నా. అప్పుడే టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఎల్లప్పుడూ ఒకరికి మరొకరు ప్రత్యామ్నాయం కాదని బలంగా నమ్ముతా. ఒకరి ఎనర్జీని మరొకరు రిప్లేస్ చేయలేరని భావిస్తా. నీలాగా మరొకరు ఉండలేరు. అందుకే నువ్వు ఎవరికీ ప్రత్యామ్నాయం కాదు. ప్రతి వ్యక్తి ముఖ్యమైన వాడేనని చూపించాలనే ఉద్దేశ్యంతో 'irreplaceable' అనే పేరును పచ్చబొట్టు వేయించుకున్నా' అని స్పష్టం చేసింది.

Read more:

Priyanka Jawalkar : ఆ హీరో అంటే చెప్పలేనంత పిచ్చి.. కానీ

Next Story

Most Viewed