మళ్లీ కలిసి తిరుగుతున్న రష్మిక-విజయ్ దేవరకొండ.. ఇదే సాక్ష్యం

by Prasanna |
మళ్లీ కలిసి తిరుగుతున్న రష్మిక-విజయ్ దేవరకొండ.. ఇదే సాక్ష్యం
X

దిశ, సినిమా: ‘గీతా గోవిందం’ చిత్రంలో మొదటిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. విజయ్ ఫ్యామిలీతోనూ రష్మిక చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు తాము మంచి స్నేహితులమంటూ కొట్టిపడేశారు. తాజాగా వీరిద్దరూ ఒకచోటే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. రష్మిక తన అసిస్టెంట్ మ్యారేజ్ అటెండ్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అలాగే విజయ్ సెండ్ చేసిన పిక్స్ చూస్తే రష్మిక, విజయ్ ఉన్న లొకేషన్ ఒకటే. దీంతో వీరిద్దరు ఒకచోటే ఉన్నట్లు రుజువైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి: క్రీడారంగంలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ..!

Next Story

Most Viewed