రష్మిక డీప్ ఫేక్ వీడియో.. అందులో తప్పేం లేదంటూ మాధవిలత సంచలన రియాక్షన్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
రష్మిక డీప్ ఫేక్ వీడియో.. అందులో తప్పేం లేదంటూ మాధవిలత సంచలన రియాక్షన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు సైతం వీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే రష్మిక వీడియోపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు పలు పోస్టులతో ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా, టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. ‘‘ రష్మిక డీప్ ఫేక్ వీడియో మరీ అంత దారుణంగా, అసభ్యకరంగా ఏమీ లేదు. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి కంటే రష్మిక ఇంకా దారుణమైన దుస్తులు వేసుకుని ఈవెంట్లు, సినిమాల్లో ఎక్స్ పోజ్ చేసింది.

ఒక స్టార్ హీరోయిన్ ఓ ఇష్యూ మీద రియాక్ట్ అయితే ఇలానే స్పందిస్తారు. పైగా ఇలాంటి వాటి మీద స్పందించడం కూడా మంచిదే. స్పందించాలి. అయితే రష్మికకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు నిలిచాయని వార్తలు విన్నాను. అది చూసి వారిని చూసి నవ్వొచ్చింది. మీరు సపోర్ట్ చేయాల్సిన రష్మికకు కాదు. మీరు అండగా నిలబడాల్సింది.. బయట ఎంతో మంది మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి.. కాబట్టి మీరు వారికి అండగా ఉండండి. వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి. రష్మిక ఏమీ సావిత్రి, సాయి పల్లవి, మాధవిలతలా పద్దతిగా కనిపించదు’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రష్మికకు సంబంధించిన పలు హాట్ పిక్స్ షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు మొదటి సారి సరిగ్గా చెప్పావ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం మాధవిలత పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Next Story