Raa Raa Penimiti OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘రారా పెనిమిటి’..

by Kavitha |
Raa Raa Penimiti OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘రారా పెనిమిటి’..
X

దిశ, సినిమా: ఈ మధ్య థియేటర్లలో విడుదలైన సినిమాలు నాలుగు లేదా మూడు వారాల్లో ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. కానీ బిగ్ చిత్రాలు మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఎంతో సమయం తీసుకుంటున్నాయి. కాగా తాజాగా OTT విడుదలైన మూవీ ‘రారా పెనిమిటి’. సింగిల్ రోల్‌తో తెరకెక్కిన ఈ సినిమా కు సత్య వెంకట గెద్దాడా దర్శకత్వం వహించారు. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రమీల గెద్దాడ నిర్మాతగా వ్యవహరించారు. టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. గత ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కాగా ఎలాంటి అప్ డేట్ కూడా లేకుండా ‘రారా పెనిమిటి’ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లోకి ఎంట్రీ ఇచ్చింది.

Next Story

Most Viewed