సెక్స్ బూస్టింగ్ ట్యాబ్లెట్స్‌ ప్రమోట్ చేస్తున్న రణ్‌వీర్.. ఇంత వైల్డ్ కంటెంట్ ఉండదేమో..

by Disha Web Desk 7 |
సెక్స్ బూస్టింగ్ ట్యాబ్లెట్స్‌ ప్రమోట్ చేస్తున్న రణ్‌వీర్.. ఇంత వైల్డ్ కంటెంట్ ఉండదేమో..
X

దిశ, సినిమా : హీరో రణ్‌వీర్ సింగ్ సెక్స్‌కు సంబంధించిన అంశాల గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటాడు. వర్జినిటీ కోల్పోవడం నుంచి సెక్స్ ప్లేలిస్ట్ వరకు అన్నింటి గురించి సిగ్గుపడకుండా షేర్ చేస్తుంటాడు. ఇప్పటికే న్యూడ్ ఫొటోషూట్‌తో కాంట్రవర్సీకి తెరలేపిన ఆయన.. డ్యూరెక్స్ కండోమ్స్ కూడా ప్రమోట్ చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి సెక్సువల్ వెల్‌నెస్ పిల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతున్నాడు. క్రేజీ వైల్డ్ కంటెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా యాడ్‌లో నటించబోతున్నాడు. దీంతో ‘బోల్డ్ కేర్’ కంపెనీకి సంబంధించిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ‘రణ్‌వీర్ అంటే ఎనర్జీ, అలాగే బోల్డ్ కేర్ సెక్స్ వెల్‌నెస్ సప్లిమెంట్స్ కూడా. అవసరమైనప్పుడు వైల్డ్‌గా ఉంటాయి’ అని ఈ యాడ్‌లో ఓ డైలాగ్ ఉండబోతుందని తెలుస్తోంది.

Next Story