- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Ranveer Singh: రణ్‌వీర్-దీపికల మధ్య అంతర్గత విబేధాలు.. ఇదే సాక్ష్యం అంటున్న ఫ్యాన్స్

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్- దీపికల మధ్య అంతర్గత విబేధాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా అన్యోన్యంగా కనిపించే జోడీ తాజాగా ఓ కార్యక్రమంలో కాస్త దూరం పాటించడం పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది. విషయానికొస్తే.. ఇటీవల జరిగిన ఓ స్పోర్ట్స్ అవార్డ్ ఈవెంట్‌లో పాల్గొన్న స్టార్స్.. వేడుకలో కాస్త దూరంగానే ఉంటూ కనిపించారు. అంతేకాదు ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం కారు ఎక్కేందుకు వస్తున్న క్రమంలో ఫొటోలకు ఫోజులివ్వాలని మీడియా కోరింది. దీంతో రణ్‌వీర్ తన భార్య చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దీపికా అస్సలు పట్టించుకోలేదు. చిన్నగా స్మైల్ ఇస్తూ ఒంటరిగానే కారు ఎక్కేందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఇద్దరికీ ఏదో గొడవ జరుగుతోంది. బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. దీపిక ఏదో విషయంలో కోపంగా ఉంది’ అంటూ పలు రకాల చర్చ నడుస్తోంది.