కూతురి పేరు టాటూ వేయించుకున్న స్టార్ హీరో

by Sujitha |
కూతురి పేరు టాటూ వేయించుకున్న స్టార్ హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ రాక్ స్టార్ రణ్ బీర్ కపూర్ అలియా భట్ తో పెళ్లి తర్వాత ఎలాంటి గాసిప్స్ కు చోటు ఇవ్వట్లేదు. అంతకు ముందు భారీ సంఖ్యలో గర్ల్ ఫ్రెండ్స్ మెయింటేన్ చేసిన ఆయన.. పాప పుట్టాక పూర్తిగా మారిపోయినట్లు తెలిపాడు. టైం దొరికితే చాలు తనతోనే గడిపేస్తున్నాడు. ఏ ఈవెంట్ కు వెళ్లినా తనను తీసుకునే వెళ్తున్నాడు. బిడ్డ అంటే అంత ప్రేమ ఉన్న హీరో.. రీసెంట్ గా మెడ మీద తన పేరు టాటూగా వేయించుకుని కనిపించాడు. Raha పేరుతో స్మార్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు. తన సెక్సీ అప్పీల్ తోఇంటర్నెట్ బ్రేక్ చేశాడు.

కాగా 'యానిమల్ ' మూవీ సక్సెస్ సూపర్ గా ఎంజాయ్ చేసిన హీరో.. ప్రస్తుతం 'రామాయణం' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపించనున్న చిత్రం నుంచి లీక్ అయిన పిక్స్ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed