Salman Khan మూవీలో మెగా హీరో Ram Charan

by Dishanational4 |
Salman Khan మూవీలో మెగా హీరో Ram Charan
X

దిశ,సినిమా: మనకు తెలిసినంత వరకు సల్మాన్‌ఖాన్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ కీలక పాత్రలో కనిపించాడు. అలాగే ఇంతకుముందు సల్మాన్ నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా తెలుగులో డబ్ చేసినపుడు సల్మాన్ పాత్రకు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇలా ఒకరినొకరు సపోర్టు చేసుకుంటూ వస్తున్నారు. ఇక రీసెంట్‌గా సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్‌తో పాటుగా రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రకటించారు. దీంతో రామ్ చరణ్‌ని చూడాలని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

బాలయ్యతో పరశురామ్ సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే

Next Story