- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇది మంచి పద్దతి కాదు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై రామ్ చరణ్ స్పందన
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుటుంబం, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవి, నిరాధారమైనవి. గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. ముఖ్యంగా ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. ఈ రకమైన అపవాదు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపడమే కాకుండా సమాజానికి చెడు సంకేతాన్ని ఇస్తుంది. చిత్ర పరిశ్రమ సోదరభావంతో కలిసి ఉంది. ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనను సహించదు. మన వ్యక్తిగత జీవితాలు మనకు పవిత్రమైనవి. అందరినీ గౌరవిద్దాం. మనం పబ్లిక్ ఫిగర్స్.. ఒకరిని ఒకరం గౌరవించుకుందాం.. అంతేకానీ ఒకరిపై ఒకరం అసత్యమైన ఆరోపణలు చేసుకొని జీవితాలను సమస్యల్లోకి నెట్టుకోవడం మంచిది కాదు’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.