రజనీలో అసలైన విలనిజాన్ని చూపిస్తా.. లోకేశ్‌ కనగరాజ్

by Disha Web Desk 7 |
రజనీలో అసలైన విలనిజాన్ని చూపిస్తా.. లోకేశ్‌ కనగరాజ్
X

దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ‘#Thalaivar 171’ నుంచి సాలిడ్ అప్ డేట్ వెలువడింది. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్‌.. రజనీ‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వీరిద్దరి కలయికలో మూవీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు.

ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేశ్.. రజనీలో విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ‘నెక్ట్స్‌ సినిమాలో తలైవాలోని నెగెటివ్ షేడ్స్‌ను చూపించబోతున్నా. రోబో సినిమా తర్వాత 171లో తలైవా విలనిజాన్ని ఎలివేట్‌ చేయబోతున్నా. అంతేకాదు రజనీకాంత్‌ పాత్రకు చాలా షేడ్స్‌ ఉన్నాయి. స్క్రిప్ట్‌ డిమాండ్ మేరకు రజనీలోని మరో కోణాన్ని ఆవిష్కరింబోతున్నా. ఇది నా కెరీర్‌లోనే ఉత్తమ కథ’ అంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story