- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రపంచాన్నే బహిష్కరిద్దామంటూ.. 65 ఏళ్ల వయసులో లేచిపోయిన సీనియర్ హీరోయిన్ జయప్రద

దిశ, సినిమా: టాలీవుడ్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ జయప్రద మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘లవ్ @65 ’. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 16) ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కాగా ఈ ట్రైలర్ ఎంతో కామెడీగా సాగింది.. ‘ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదు దాకా ఉంటాయి. ఈ ఇద్దరు కాలనీ నుంచి పారిపోయారు. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు’ అంటూ ఆసక్తికరమైన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవ్వగా. రాజేంద్ర ప్రసాద్, జయప్రద యాక్టింగ్ ఇటు కామెడీ తో పాటుగా మనసును కదిలించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఇక చివర్లో ‘ఈ ప్రపంచం మన ప్రేమను తిరస్కరిస్తే.. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం’ అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఫుల్ గా నవ్వించేసింది. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.