Razakar : వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలైన ‘రజాకార్’ సినిమా.. రివ్యూ ఎలా ఉందంటే? (వీడియో)

by Hamsa |
Razakar  : వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలైన ‘రజాకార్’ సినిమా.. రివ్యూ ఎలా ఉందంటే? (వీడియో)
X

దిశ, సినిమా: యాటా సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం రజాకార్. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, రాజ్ అర్జున్, మకరంద పాండే, వేదిక, ప్రేమ తదితరులు నటించగా.. గూడూరు నారాయణ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా రజాకార్లు సాగించిన దుర్మార్గాలను వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులోంచి విడుదలై పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అందరినీ మెప్పించాయి. అంతేకాకుండా పలు వివాదాలు కూడా తలెత్తాయి. ఈ మూవీ ఓ వర్గాన్ని కించపరచేలా ఉందంటూ.. రిలీజ్ అడ్డుకోవాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెన్ ఆఫ్ సివిల్ రైట్స్ పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ అవన్నీ దాటుకుని ఎట్టకేలకు ఈ సినిమా నేడు మార్చి15న థియేటర్స్‌లో విడుదలైంది. భారత దేశానికి ఆగస్టు 15, 1947 రోజున స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్‌ దానిని అమలు చేయలేదు.

స్వతంత్ర పాలనలో ప్రైవేట్ సైన్యం రజాకార్లతో క్రూరమైన, దౌర్బాగ్యకర పరిస్థితుల్లో పాలన కొనసాగించింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్‌ను బూచిగా చూపించి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్లాం మత వ్యాప్తి, తురకిస్థాన్ లక్ష్యంగా పాలన చేశాడు. నిజాం రాజుకు సైనికాధికారిగా ఖాసీం రజ్వి ఎన్నో దురాగతాలకు, హిందూ మహిళలపై అరాచకాలు కొనసాగించడంతో భారత ప్రభుత్వం, ప్రధాని నెహ్రూను ఎదురించి హోం మంత్రి పటేల్ హైదరాబాద్ స్టేట్‌పై సైనిక చర్యకు పూనుకొంటాడు. అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి నెహ్రూ ఒప్పుకోడు. ఈ సమస్యను పటేల్ ఎలా పరిష్కరించాడు? మతం మార్పిడి కోసం రజాకార్లు చేసిన రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? వారి దాడిలో వీరమరణం చెందిన వారు ఎంతమంది? అనే విషయాలు ఇందులో చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకెళ్తుంది.

Next Story

Most Viewed