ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రాఘవ లారెన్స్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

by Hamsa |
ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రాఘవ లారెన్స్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. హీరోలకు డ్యాన్స్ నేర్పుతూనే డైరెక్టర్‌గా హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా అనాధ పిల్లలకు పలు సేవా కార్యక్రమాల ద్వారా తనకు చేతనైన సహాయం చేస్తూ గొప్ప మనస్సు చాటుకుంటున్నాడు. అంతేకాకుండా అనాథ పిల్లలను చదివిస్తూ, వృద్దాశ్రమాలు నడిపిస్తున్నాడు. ఇటీవల రాఘవ నటించిన చిత్రం జిగర్ తండా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రాఘవ లారెన్స్ ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, చివరిసారిగా చెన్నైలో ఫ్యాన్స్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా, నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఇది హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించింది. ఆ రోజు అలా జరగడం చూశాక నా అభిమానులు నా కోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను.

అందుకే నేను వారి కోసం ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహిస్తాను. నేను దానిని రేపటి నుండి ప్రారంభిస్తున్నాను. మొదటి స్థానం లోగ లక్ష్మి మహల్ వద్ద విల్లుపురం. రేపు అందరం కలుద్దాం’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story