అక్షయ్‌తో రేప్ సీన్.. ఆయనకు చూపించొద్దని వేడుకున్న ప్రియాంక

by Anjali |
అక్షయ్‌తో రేప్ సీన్.. ఆయనకు చూపించొద్దని వేడుకున్న ప్రియాంక
X

దిశ, సినిమా: అక్షయ్ కుమార్ హీరోగా 2004లో వచ్చిన ‘ఐత్రాజ్’ సినిమాలో ‘సెక్సువల్లీ ఫార్వర్డ్’ ఉమెన్ క్యారెక్టర్‌లో నటించిన ప్రియాంక.. ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్‌ చూపించిన ప్రభావం గురించి ఓపెన్ అయింది. అబ్బాస్-మస్తాన్ దర్శకత్వం వహించిన సినిమాలో విలన్ పాత్రలో ప్రశంసలు అందుకున్న ప్రియాంక.. అక్షయ్‌తో నటించిన రేప్ సీన్‌ను రాకేష్ రోషన్‌కు చూపించొద్దని దర్శకులను వేడుకుందట. ‘రాకేష్ సార్ నన్ను ఓ అంత్యక్రియల కార్యక్రమంలో చూసి పిలిచి ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని చెప్పాడు. ఆ తర్వాత నాకు వరుసగా కాల్ చేస్తున్నాడు. దీంతో వెంటనే నేను అబ్బాస్-మస్తాన్‌కి కాల్ చేసి ‘మేరీ ఇజ్జత్ కా సవాల్ హై. ప్రిమియర్ షోలో దయచేసి అక్షయ్‌తో రేపు సీన్ అతనికి చూపించొద్దు’ అని రిక్వెస్ట్ చేశా. కానీ, ఎట్టకేలకు రాకేష్ ఆ సన్నివేశం చూసి నన్ను క్రిష్‌లో నటించమని అడిగాడు. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. అతని కళ్లలోకి సూటిగా చూడలేకపోయా’ అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంది ప్రియాంక.

Read more:

ఆ కారణంతోనే చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లోకి నిఖిల్‌ను తీసుకున్నాడా?Next Story

Most Viewed