మోడీ గవర్నమెంట్‌పై ప్రశంసలు కురిపించిన ప్రియాంక చోప్రా.. మహిళలకు మద్దతివ్వడంపై..

by Disha Web Desk 9 |
మోడీ గవర్నమెంట్‌పై ప్రశంసలు కురిపించిన ప్రియాంక చోప్రా.. మహిళలకు మద్దతివ్వడంపై..
X

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇండియన్ గవర్నమెంట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. మహిళా సాధికారత కోసం ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని కొనియాడింది. ‘ఇదిగో భారతదేశం మహిళలకు నిజంగా మద్దతిస్తుంది. సాధికారతనిస్తుంది. ఈ చారిత్రాత్మక మైలురాయితో కొత్త యుగానికి నాంది పలికింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం ‘నారీ శక్తి వందన్ అధినియం’ నిజానికి సరైన దిశలో ముందడుడుగు. అయితే కీలకమైన తదుపరి దశ దానిని వేగంగా, సమర్థవంతంగా అమలు చేయడం’ అని ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. భారతీయ స్త్రీలకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Next Story

Most Viewed