పెద్దనాన్న కృష్ణంరాజు ముందే స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ ఘాటు రొమాన్స్!

by Disha Web Desk 9 |
పెద్దనాన్న కృష్ణంరాజు ముందే స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ ఘాటు రొమాన్స్!
X

దిశ, సినిమా: కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చి.. ఛత్రపతి, పౌర్ణమి, బుజ్జిగాడు, రాఘవేంద్ర, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. రీసెంట్‌గా సలార్ చిత్రంతో మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రభాస్ కెరీర్ మలుపు తిరిగిన చిత్రాల్లో శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం సినిమా ఒకటి.

హీరోయిన్‌ త్రిషతో జతకట్టి.. స్టార్ హీరోగా అవతారం ఎత్తాడు. ఈ ఇద్దరి కాంబో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో రెబల్ స్టార్-త్రిష రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభాస్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడేవారట. అలాంటిది ఓ రోజు రెబల్ స్టార్ పెద్దనాన్న కృష్ణం రాజు ముందే ప్రభాస్ రొమాన్స్ చేయాల్సి వచ్చిందట. అయితే వర్షం మూవీ నిర్మాత ఓ రోజు కృష్ణం రాజును షూటింగ్ స్పాట్ కు రామ్మన్నాడట. పెద్దనాన్న వచ్చే సంగతి ప్రభాస్ కు తెలియదు.

అప్పటికే త్రిష-ప్రభాస్ మధ్య రొమాంటిక్ సన్నివేశం షూట్ చేస్తున్నారు. ఇక ఈ సీన్ కంప్లీట్ అయ్యాక రెబల్ స్టార్ పక్కకు వచ్చి చూస్తే అక్కడ కృష్ణం రాజు ఉన్నారట. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ షాక్ తిన్నాడట. సిగ్గుతో, మోహమాటంతో తల కిందకు వేసుకున్నాడట. అప్పుడు కృష్ణం రాజు ఈ హీరో తల భుజం తట్టి యాక్టర్స్ అన్నాక ఇవన్నీ కామన్ అని చెప్పాడట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed