‘కల్కి’ కోసం ముంబైలో దిగిన ప్రభాస్.. లుక్స్ అండ్ కటౌట్స్ అదుర్స్

by Kavitha |
‘కల్కి’ కోసం ముంబైలో దిగిన ప్రభాస్.. లుక్స్ అండ్ కటౌట్స్ అదుర్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898AD. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 27న ఈ భారీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, గ్లింప్స్, సాంగ్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ నెమ్మదిగా చేస్తుండగా.. ఓ పక్కా సెన్సార్ కూడా పూర్తయిందని సమాచారం. ఇక కల్కి సినిమా ప్రమోషన్స్‌ని బాలీవుడ్‌లో ప్లాన్ చేస్తున్నారు. దీంతో ముంబైలో భారీగా కల్కి ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయ్యారు మూవీ టీమ్. దీనికోసం ప్రభాస్ నిన్న రాత్రి ముంబై తరలి వెళ్లారు. ముంబైలో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్ సరికొత్త లుక్ చూసిన నెటిజన్లు ఏమున్నాడ్రా బాబు, కటౌట్ అదుర్స్‌గా అని అంటున్నారు. ఈ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇవాళ ముంబైలో జరగబోయే కల్కి ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్రభాస్ పాల్గొననున్నాడు.Next Story

Most Viewed