- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభాస్ ‘kalki2898AD’ వాయిదా.. క్లారిటీ ఇస్తూ మేకర్స్ ఆసక్తికర ట్వీట్

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి’. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రల్లో నటించనున్నారు. దీనిని భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. వైజయంతి మూవీ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే కల్కి వాయిదా పడినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ ట్విట్టర్ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘ జస్ట్ వామ్ అప్ ప్రభాస్’’ 2024 మే 9న రిలీజ్ కానుందని క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ పెంచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఫుల్లు వైరల్ అవుతోంది.