ఎయిర్ పోర్ట్‌లో ప్రభాస్‌ చెంప చెల్లుమనిపించిన అమ్మాయి.. ( వీడియో )

by Disha Web Desk 10 |
ఎయిర్ పోర్ట్‌లో ప్రభాస్‌ చెంప చెల్లుమనిపించిన అమ్మాయి.. ( వీడియో )
X

దిశ, సినిమా: స్టార్‌డమ్‌ను ఎలా కాపాడుకోవాలో తెలిసిన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఎప్పుడు జనంలోకి వచ్చినా.. తన కోసం వచ్చిన అభిమానులను అసలు నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఫ్యాన్స్ ఫొటోల కోసం ఎంత టైమ్‌ అయినా కేటాయిస్తాడు. ఇక తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుంది. ఇందులో ప్రభాస్ చెంపపై ఓ లేడీ ఫ్యాన్ కొట్టడంతో వైరల్ అవుతుంది. అవును తాజాగా ఎయిర్ పోర్ట్‌లో ప్రభాస్‌ను చూసిన ఓ లేడీ ఫ్యాన్ అతనితో ఫొటో దిగి.. ఆనందం తట్టుకోలేక ఒక సారి తాకాలనే ఉద్దేశంతో ప్రభాస్ చెంప మీద కొట్టింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story