రేపు పవర్ ప్యాక్ సర్ ప్రైజ్.. ఇక అభిమానులకు జాతరే..

by Shiva |
రేపు పవర్ ప్యాక్ సర్ ప్రైజ్.. ఇక అభిమానులకు జాతరే..
X

దిశ, వెబ్ డస్క్ : పవన్ అభిమానులకు అప్పుడే పండగ షురువైంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నా.. పవన్ సినిమా షూటింగ్ లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తనతో సినిమా తీసేందుకు చాలా మంది దర్శక, నిర్మాతలు క్యూలో ఉన్నారు. మరికొన్ని సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఓజీ'కి సంబంధించి చిత్ర యూనిట్ ఓ స్పెషల్ అప్ డేట్ ను రివీల్ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కు సంబంధించి మూవీ టీం పోస్టర్ ను పవన్ జన్మదినం సందర్భంగా రేపు సాయంత్రం 6.03 కు పోస్టర్ ను విడుదల చేయనున్నారు. అదేవిధంగా పవన్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న పీరియాడికల్ మూవీ 'హరిహర వీరమల్లు'కు సంబంధించి కీలక అప్ డేట్ రానుంది. మూవీకి సంబంధించి పవర్ ప్యాక్ పోస్టర్ ను ఈరోజు రాత్రి 12.15 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఓకే సారి, ఓకే రోజు మూడు సినిమాలకు సంబంధించి కీలక అప్ డేట్స్ రానుండటంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడి ఫస్ట్ లుక్ ఆ మూడు సినిమాల్లో ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి : మరోసారి రిపీట్ కానున్న తండ్రీకొడుకుల జోడి.. ఈసారి గెస్ట్ రోల్ కాదంట..!

Next Story

Most Viewed