పవన్ కల్యాణ్ 'OG' సినిమాలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ!

by Disha Web Desk 6 |
పవన్ కల్యాణ్ OG సినిమాలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ!
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూనే వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. డైరెక్టర్ సుజిత్, పవన్ కాంబినేషనల్‌లో రాబోతున్న చిత్రం 'OG'. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రామలు కూడా పూర్తయ్యాయి. ఇందులో నటించే నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. '' న్యూ మూవీ.. న్యూ లుక్.. బ్యాక్‌ టూ OG'' అనే క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా షూటింగ్‌లో ఉన్న ఫొటోను కూడా ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story

Most Viewed