నాని తదుపరి చిత్రంలో పూజా హెగ్డే

by Disha Web Desk 6 |
నాని తదుపరి చిత్రంలో పూజా హెగ్డే
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ చూస్తుంటే ఈ మూవీ విషయంలో నాని సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనిపిస్తోంది. ఇదిలా ఉంటే నాని తన తదుపరి ప్రాజెక్ట్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రాబోతున్న విషయం తెలిసిందే.

దీంతోపాటుగా తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో కూడా ఓ సినిమా చేయనున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచానం. నాని సినిమాలో హీరోయిన్స్‌కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక పూజ విషయానికి వస్తే మొన్నటిదాకా తెలుగులో స్టార్ హీరోయిన్‌‌గా కొనసాగినా.. ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే నాని మూవీ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి పూజను ఈ సినిమా మళ్లీ బిజీ అయ్యేలా చేస్తుందేమో చూడాలి.

Next Story

Most Viewed