వరుణ్ పెళ్లిలో పెద్ద తప్పు చేసిన నాగబాబు..!

by Disha Web Desk 9 |
వరుణ్ పెళ్లిలో పెద్ద తప్పు చేసిన నాగబాబు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి బుధవారం ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కుమార్తె లావణ్య రెడ్ కలర్ శారీ కట్టుకుని ముస్తాబైంది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ జంట పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ ఫొటోలకు ‘varunLav’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ పెళ్ళిలో తెగ సందడి చేశారు. మొత్తానికి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా కోలాహలంగా జరిగింది. కానీ.. ఇలాంటి క్రమంలో వరుణ్ తండ్రి నాగబాబు పెద్ద తప్పు చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.

హిందూ సంప్రదాయం ప్రకారం కళ్యాణమండపం అంటే దేవాలయం గా భావిస్తారు. వధువు, వరుడిని దేవుళ్లలా భావించి మండపంపై కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. అలాంటి మండపంపై నాగబాబు చెప్పులు వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. నాగబాబు కంటే చిన్న వయసున్న హీరోలంతా మండపాన్ని గౌరవించి చెప్పులు లేకుండా వచ్చారు. అన్ని తెలిసినవారు సొంత కొడుకు పెళ్లిలో ఇంత పెద్ద తప్పు చేస్తారా? వరుణ్‌ను అవమానించినట్లేగా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.Next Story

Most Viewed