‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ టీజ‌ర్ రిలీజ్.. బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన తాప్సీ

by Kavitha |   ( Updated:2024-02-29 14:32:48.0  )
‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ టీజ‌ర్ రిలీజ్.. బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన తాప్సీ
X

దిశ, సినిమా: 2021లో జరిగిన థ్రిల్లింగ్‌ మర్డర్‌ మిస్టరీ కథాంశంతో, నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లై రికార్డు వ్యూస్ సాధించిన మూవీ ‘హసీన్ దిల్‌రుబా’. జయ్‌ప్రద్‌ దేశాయ్ ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ సూప‌ర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ అంటూ రానున్న ఈ సినిమా .. ఫ‌స్ట్ పార్ట్‌లో న‌టించిన విక్రాంత్‌ మాస్సే, తాప్సీనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో భాగంగా తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఇక ఈ టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. ఫ‌స్ట్ పార్ట్‌లో భ‌ర్త (విక్రాంత్‌ మాస్సే)తో క‌లిసి పన్నాగం పన్ని ప్రియుడిని చంపిన రాణి కశ్యప్‌(తాప్సీ) అక్కడ‌నుంచి పారిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. దీంతో ఈ కొత్త జీవితంలో రాణికి ఎదురైన సంఘ‌ట‌న‌లు ఏంటి?.. రాణి లైఫ్ లోకి పోలీసులు ఎందుకు వస్తారు?. రాణిని కాపాడటానికి విక్రాంత్‌ మాస్సే ఏం చేస్తాడు..? అనేది తెలియాలంటే సినిమా సీక్వెల్ చూడాల్సిందే. కాగా ఈ టీజర్ తాప్సీని చూస్తుంటే బోల్డ్ గా బెడ్ రూం సీన్స్‌లో రెచ్చిపొయినట్లుగా తెలుస్తోంది. ఇక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రాన్ని కనికా థిల్లాన్ నిర్మిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ ఇందులో ఓ కీల‌క పాత్రలో న‌టిస్తున్నాడు.

Next Story

Most Viewed