‘భారతీయుడు 2’ సినిమాకు బిగ్ షాక్.. విడుదల ఆపాలంటూ పిటిషన్

by sudharani |
‘భారతీయుడు 2’ సినిమాకు బిగ్ షాక్.. విడుదల ఆపాలంటూ పిటిషన్
X

దిశ, సినిమా: విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజా చిత్రం ‘భారతీయుడు 2’. టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య లాంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూలై 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే.. ఇంకా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉన్న క్రమంలోనే మూవీకి బిగ్ షాక్ తగిలింది.

ఈ సినిమా విడుదల ఆపాలంటూ అసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి మదురై జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు ‘మా అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఇందులో వినియోగించారు.. థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ విడుదల కాకుండా నిషేదం విధించాలి’ అంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై బుధవారం విచారణ జరిగిన కోర్టు.. ‘భారతీయుడు 2’ చిత్ర బృందం ఈ ఇష్యూపై స్పందించాలని వారికి కొంచెం సమయాన్ని కేటాయించి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో తెలియాల్సి ఉంది.

Next Story